Blog

Articles

11-11-2019 | 0 | 13

 

An educated society is one of the greatest wealth of any nation. There is no substitute for knowledge and education and this is the reason nations and organisations world over are striving hard to create a world that is abundant in knowledge. 

Education doesn’t merely mean literacy, it is also not the degrees and titles that many possess. Education is a weapon that promotes social equality, it encourages responsibility towards society and contributes immensely to the nation’s growth. 

India’s first Education Minister Maulana Abul Kalam Azad believed in exactly this school of thought and dreamt of an educated and uplifted society. As an Education Minister of the young nation, he was the man behind various apex bodies such as the first IIT, IISc, School of Planning and Architecture and the University Grants Commission. All these institutions were conceptualised and established under his tenure.

Maulana Azad believed that educational institutions were the fundamental building block of the next generation.

A poet, orator par excellence, a freedom fighter and an eminent educationalist, Maulana Azad throughout his life strived to provide equal opportunities to all. He strongly advocated and contributed to universal primary education, girls’ education, free and compulsory education for all children up to the age of 14, vocational training and technical education.

On National Education Day, a day we mark in honour of his birth anniversary, I pay my humble tributes to the great leader who spent his whole life to give the gift of education to the nation. 

 

 

 

 

 


11-11-2019 | 0 | 281

పాదయాత్రలో నేను పర్యటించిన ప్రాంతాల్లో రాజకీయ పరిస్థితుల గురించి ముందుగా తెలియజేస్తాను. విభజన తరువాత ఎపికి ఒక సీనియర్ నేత సారధ్యం, కేంద్రం సహకారం అవసరమని భావించి ప్రజలు టిడిపి, బిజెపి కూటమికి పట్టం కట్టారు. కానీ ప్రజలు ఆశించిన రీతిలో అభివృద్ధి జరగలేదు. సరికదా, ఎన్డీఎ నుంచి కూడా టిడిపి బయటకొచ్చింది. ఎపికి ఎంతో ముఖ్యమైన రాజధాని, పోలవరం ప్రాజెక్టు వంటి అంశాల్లో చంద్రబాబు సాగదీత వైఖరి కారణంగా రాష్ట్రం ఇప్పుడు అనేక ఇబ్బందులు పడుతోంది. చంద్రబాబునాయుడుపై వ్యతిరేకతతో ప్రజలు వైసిపికి పట్టం కట్టారు. అయితే కేవలం అయిదు నెలల్లోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏకపక్ష పోకడలతో వ్యతిరేకత తెచ్చుకున్నారు. పోలవరం రీటెండర్లు, రాజధాని పనులు నిలిపివేత, ప్రభుత్వ చర్యల కారణంగా పారిశ్రామికవేత్తలు వెనక్కివెళ్లడం, వరద నీటి నిర్వహణలో విఫలమవడం వంటి విషయాలను ప్రజలు హర్షించడం లేదని నా పరిశీలనలో వెల్లడయింది. ప్రాంతీయ పార్టీలైన టిడిపి, వైసిపిలపై వున్న వ్యతిరేకత జాతీయపార్టీ అయిన బిజెపికి అనుకూలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

సమస్యల విషయానికొస్తే ఆయా ప్రాంతాలను బట్టి ఒక్కో చోట ఒక్కో సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పశ్చిమ కృష్ణాలో ప్రజలు సాగునీటి సమస్యను ఎదుర్కొంటున్నారు. సాగర్ ఆయకట్టు జోన్ 2లో వుండడం వల్ల నీరు సరిగా అందడం లేదు. సాగునీరు లేకపోవడం వల్ల రైతులు వర్షాధారంగా పెద్ద ఎత్తున సుబాబుల్ సాగు చేస్తున్నారు. కానీ దీనికి రేటు లేకపోవడం, కొనుగోళ్లు సరిగా జరగకపోవడం వల్ల రైతులు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు. టన్నుకు కనీస ధర రూ.4,200 వుండగా, కేవలం రెండు వేలకే కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డెల్టా ప్రాంతాలైన గుడివాడ, పామర్రు నియోజకవర్గాల ప్రజలు సరైన రోడ్లు లేక ఇబ్బందిపడుతున్నారు. గుడివాడ పట్టణం అయితే ఎలాంటి అభివృద్ధికీ నోచుకోలేదు.

ప్రకాశం జిల్లా కూడా సాగర్ జోన్ 2లో వుండడం వల్ల నాలుగేళ్లుగా నీరందక ఇబ్బందిపడుతున్నారు. పశ్చిమ కృష్ణా లాగే ఇక్కడ కూడా సుబాబుల్ సాగు ఎక్కువ. దీన్ని కొనే నాధుడే లేడు. ఈ జిల్లాలో పేపర్ మిల్లు ఏర్పాటుకు గత ప్రభుత్వం ఇండోనేషియా కంపెనీతో ఎంవోయు కుదుర్చుకుంది. అయితే కొత్త ప్రభుత్వం వచ్చాక దీని జాడే లేదు. రామాయపట్నం పోర్టు ఈ జిల్లా ప్రజలకు సెంటిమెంటుగా మారింది. వెలుగొండ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలున్నా, చెరువులు పూర్తిగా నింపడంలో ఈ ప్రభుత్వం విఫలమైంది. హంద్రీ నీవా కాలువలకు సకాలంలో నీటి విడుదల చేయకపోవడం, కాలువలను చెరువులకు అనుసంధానించడంలో నిర్లక్ష్యం వహించడం పట్ల ప్రజలు ఆగ్రహంతో వున్నారు. గాలేరు నగరి ప్రాజెక్టును పూర్తిచేసి చిత్తూరు జిల్లాకు నీరివ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అదే విధంగా టమోటా పంటకు గిట్టుబాటు ధరల్లేక ఒక్కోసారి పొలాల్లోనే వదిలేయాల్సి వస్తోందని, టమోటా నిల్వ చేసుకునే సౌకర్యాలు ఏర్పాటు చేయడంతో పాటు, టమోటా ఆధారిత ఉత్పత్తుల తయారీ కేంద్రాలు ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు. ఈ సమస్యలన్నింటిపై అధ్యయనం చేసి, వీటి పరిష్కారానికి భారతీయ జనతా పార్టీ తరపున రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాను.


11-11-2019 | 0 | 26

మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని భారతీయ జనతాపార్టీ చేపట్టిన గాంధీ సంకల్పయాత్రలో భాగంగా అక్టోబరు 15 నుంచి 31 వరకు ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో పాదయాత్రలు నిర్వహించాను. కృష్ణా  జిల్లాలో జగ్గయ్యపేట, నందిగామ, నూజివీడు, పెనమలూరు, గుడివాడ, పామర్రు నియోజకవర్గాలు, ప్రకాశం జిల్లాలో ఒంగోలు నియోజకవర్గం, నెల్లూరు జిల్లాలో నెల్లూరు, చిత్తూరు జిల్లాలో గంగాధర నెల్లూరు, అనంతపురం జిల్లాలో ధర్మవరం నియోజకవర్గాల్లో పర్యటించాను. 

జగ్గయ్యపేట, నెల్లూరు నియోజకవర్గాల్లో నాతో పాటు బిజెపి జాతీయ కార్యదర్శి సత్యకుమార్ గారు, పెనమలూరు నియోజకవర్గంలో కేంద్రమంత్రి సదానందగౌడ గారు, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీ నారాయణ గారు, మాజీ మంత్రులు కామినేని శ్రీనివాస్, పి.మాణిక్యాలరావుగారు పాల్గొన్నారు. గుడివాడ, పామర్రు నియోజకవర్గాలలో ఆంధ్రప్రదేశ్ బిజెపి ఇన్ చార్జి సునీల్ దేవధర్ గారు, బిజెపి నేత విష్ణువర్దన్ రెడ్డిగారు, ఒంగోలులో బిజెవైఎం నేత రమేష్ నాయుడు గారు పాల్గొన్నారు. మొత్తం 152 కిలోమీటర్లు జరిపిన ఈ పాదయాత్రలో గాంధీ గారి ఆశయాలు, లక్ష్యాలు, వాటి సాధనకు మనం చేయవలసిన కృషి గురించి ప్రజలకు మా బృందం వివరించింది. 

గాంధీ గారి  పేర్లు పెట్టుకున్న నకిలీ గాంధీలు ఈ దేశంలో గాంధేయవాదాన్ని ఆచరించడంలో విఫలమయ్యారని ప్రజలు కూడా గుర్తించారు. గాంధీ మార్గమంటే పేరు చివరన గాంధీ అని పెట్టుకుని, వీధులకు గాంధీగారి పేరు పెట్టడం కాదని ప్రజలకు తెలియజేశాము. గ్రామ స్వరాజ్యం రావాలంటే వ్యవసాయం బాగుండాలని, రైతు కొడుకు కూడా రైతు కావాలని కోరుకున్నప్పుడే దేశం బాగుంటుందని చెప్పాము. స్వచ్ఛ భారత్, అవినీతి రహిత భారత్  కోసం పనిచేయాలని పిలుపునిచ్చాము. పాదయాత్రల సందర్భంగా పార్టీలకతీతంగా ప్రజలు మమ్మల్ని ఆదరించారు. పలు చోట్ల స్థానికంగా వున్న సమస్యలను వివరించగా, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చాము. మొత్తంగా పాదయాత్ర వల్ల మారుమూల గ్రామల్లో పరిస్థితులు, అక్కడి ప్రజల సమస్యల గురించి తెలుసుకునే అవకాశం ఏర్పడింది. పాదయాత్రలో పాల్గొని వాటి విజయవంతానికి కృషి చేసిన నేతలు, ముఖ్యనాయకులు, ప్రజలందరికీ నా ధన్యవాదములు తెలుపుకుంటున్నాను.


11-11-2019 | 0 | 9

తెలుగు ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు. ద్వాపరయుగంలో ప్రజలను నానారకాలుగా వేధించిన నరకాసురుడనే రాక్షసుడ్నిశ్రీకృష్ణుడు సత్యభామతో కలిసి వధించిన సందర్భంగా ప్రజలందరూ ప్రతి ఇంటి ముందు ప్రమిదలు వెలిగించి సంతోషంతో పండుగ చేసుకున్నారు. అప్పటి నుంచి మనం ఈ రోజును దీపావళిగా జరుపుకుంటున్నాము. చరిత్రలో చెడుపై మంచి గెలిచిన ప్రతి సందర్భం కూడా మనం ఒక పండుగలా జరుపుకుంటున్నాం. ఈ దీపావళి మనందరి జీవితాల్లో కొత్త వెలుగులు పంచాలని ఆ భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను.

ఈ దీపావళి ప్రత్యేకత ఏంటంటే భారతీయజనతాపార్టీ శ్రేణులు, నాయకత్వం దేశవ్యాప్తంగా పాదయాత్రలు నిర్వహిస్తున్న సందర్భం కావడం. బాపూజీ 150వ జయంతి సందర్భంగా, బాపూజీ ఆశయాలు ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు గాంధీ సంకల్పయాత్రలు జరపాలని ప్రధాని నరేంద్రమోడి ఇచ్చిన పిలుపు మేరకు బిజెపి చట్టసభల సభ్యులు, ముఖ్యనేతలు  దేశవ్యాప్తంగా పాదయాత్రలు చేస్తున్నారు. ఈ పాదయాత్రల్లో ప్రజలతో మమేకం అవుతూ, గాంధీగారి ఆశయాలను ప్రజలకు వివరిస్తూ, వాటిని ఆచరించాల్సిన అవసరాన్నిగుర్తు చేస్తున్నారు.

పాదయత్రలో భాగంగా నేను ఇప్పటివరకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో 98 కిలోమీటర్లు నడిచాను. నాతో పాటు ఆయా ప్రాంతాల్లో వున్నబిజెపి ముఖ్యనేతలు కూడా ఇందులో పాల్గొన్నారు. కేంద్రమంత్రి సదానందగౌడ గారు, బిజెపి జాతీయ కార్యదర్శి సత్యకుమార్ గారు, రాష్ట్రాధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గారు, ఇలా ఎందరో ప్రముఖులు ఒక్కో రోజు ఒక్కో కేంద్రంలో నాతో పాటు అడుగులు వేశారు. గాంధీ గారి పేర్లు పెట్టుకున్నవారు గాంధీగారి ఆశయాలను మరచిపోయిన ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన  ఆశయాలు ప్రజలకు తెలియజేయడానికి  ఇలాంటి యాత్రలు నిర్వహించడం అభినందనీయమని పలువురు పెద్దవారు తమ అభిప్రాయాలు తెలిపారు. ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టిన ప్రధానమంత్రిని అభినందిస్తున్నారు.

ప్రతి మనిషీ తోటి మనిషిని ప్రేమించాలని, సత్యం పలకాలని, హింసకు దూరంగా వుండాలని గాంధీ గారు చెప్పిన సూక్తులను ప్రస్తుత సమాజం మరచిపోతున్న తరుణంలో ఇలాంటి  కార్యక్రమం ద్వారా ఆయన ఆశయాలు, ఆయన జీవనవిధానం, సూక్తులను ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమంలో నేను భాగమవడం నాకెంతో సంతోషాన్నిచ్చింది. అహింస, సత్యాగ్రహం అనే రెండు ఆయుధాలతో ఆయన మన  దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చారు. 20 వ శతాబ్దంలో ప్రపంచం గుర్తించిన నాయకుడు మహాత్మాగాంధీ అయితే, 21వ శతాబ్దంలో ప్రపంచం గుర్తించిన నాయకుడు ప్రధానమంత్రి నరేంద్రమోడి. గాంధీగారి ఆశయాలను పాటిస్తూ ఆయన, స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి పెద్దపీట వేశారు. ఆయుష్మాన్  భారత్ పథకం 50 కోట్ల మంది  పేదలకు ఉచితంగా వైద్యసేవలు అందిస్తోంది. ఆర్టికల్ 370 రద్దు ద్వారా దేశానికి సంపూర్ణస్వరాజ్యం తీసుకొచ్చారు. బాపూ గారి కలలు నిజం చేస్తూ, దేశాన్ని ప్రపంచంలో సమున్నతంగా  నిలిపేందుకు కృషి చేస్తోంది మోడీ నాయకత్వంలోని కేంద్రప్రభుత్వం.

పెద్దగా నీటిపారుదల సౌకర్యాలు లేని కృష్ణా జిల్లా పశ్చిమ ప్రాంతం నుంచి నా యాత్ర మొదలుపెట్టాను. ప్రజల నుంచి విశేష స్పందన  లభించింది. ముఖ్యంగా కంచికచర్ల, నూజివీడుల్లో జరిగిన సభలకు పెద్ద ఎత్తున జనం హాజరయ్యారు. తమ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలను నాకు తెలియజేశారు. ప్రధానంగా సుబాబుల్ రైతులు గిట్టుబాటు ధర లేక గత కొన్నేళ్లుగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ మద్దతు ధరకు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. జగ్గయ్యపేట, నందిగామ ప్రాంతాలు సాగర్ ఆయకట్టు జోన్ 2లో వున్నాయి. ఉమ్మడి ఎపిలోనే సరిగా నీరు అందేది కాదు. తెలంగాణ ఏర్పడ్డాక అసలు నీరందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

 విజయవాడ, హైదరాబాద్ జాతీయ రహదారిపై ట్రామాకేర్ సెంటర్ లేకపోవడం వల్ల ప్రమాదాలు జరిగినప్పుడు సకాలంలో వైద్యం అందక చనిపోతున్నారు. హైవేపై  జగ్గయ్యపేట, నందిగామ మధ్య ట్రామాకేర్ సెంటర్ ఏర్పాటు చేయాలని, జగ్గయ్యపేట ఇండస్ట్రియల్ ఎస్టేట్, ఆటోనగర్ లో మౌలిక సదుపాయాలు కల్పించి పరిశ్రమలు ఏర్పాటు చేయాలని కోరారు. ఇక విజయవాడ శివార్ల నుంచి పెనమలూరు వరకు జరిగిన  యాత్రలో నగర బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు. ఇటీవల మారిన రాజకీయ  పరిస్థితుల నేపథ్యంలో పట్టణ ప్రజల్లో బిజెపి పై ఒక సానుకూల దృక్పథం కనిపించింది.

 రాయలసీమలో ధర్మవరం, గంగాధరనెల్లూరు నియోజకవర్గాల్లో పాదయాత్రలో పాల్గొన్నాను. ధర్మవరంలో ప్రజలు యాత్రకు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ఇక్కడ బిజెపి కార్యకర్తలపై అధికారపార్టీ వారి దాడులు పెరిగాయని నా దృష్టికి వచ్చింది. వారికి  కేంద్రం అండగా వుంటుందని ధైర్యం చెప్పాను. అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో ప్రధాన సమస్య తాగు,  సాగునీటి సమస్య. దీన్ని అధిగమించాలంటే హంద్రీనీవా, గాలేరు నగరి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాల్సి వుంది. కానీ గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం రెండూ కూడా ఈ విషయంలో శ్రద్ధ పెట్టలేదు. 'మాకు నీరు లేదయ్యా.. నీరుంటే బంగారం పండిస్తాం'.. అని ఓ రైతు చెప్పిన మాటలు ఇప్పటికీ నా చెవుల్లో వినిపిస్తూనే వున్నాయి. ఈ రెండు ప్రాజెక్టులు వెంటనే పూర్తి  చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను.

ప్రకాశం జిల్లా ఒంగోలులో నిర్వహించిన పాదయాత్ర, సభ విజయవంతమయ్యాయి. ప్రకాశం జిల్లా బిజెపి శ్రేణులంతా కార్యక్రమంలో  పాల్గొని విజయవంతం చేశారు. ఒంగోలు సభలో రైతులు  ఎక్కువగా పాల్గొన్నారు. గత అయిదేళ్లుగా సాగర్ నీరందకపోవడం, రామాయపట్నం పోర్టుపై ప్రభుత్వాల నిర్లక్ష్యం, పారిశ్రామికీకరణ లేకపోవడం వల్ల వెనుకబాటుతనం, వెలుగొండ ప్రాజెక్టు కొన్నేళ్లుగా నత్తనడక నడుస్తుండడం వంటి  ప్రధానమైన  సమస్యలు ప్రస్తావించారు. ఇక్కడ కూడా సుబాబుల్ రైతులు ధరలేక, కొనేవాళ్లు లేక ఇబ్బందిపడుతున్నారు. గత ప్రభుత్వం ఈ జిల్లాపై వివక్ష చూపిందన్న అభిప్రాయం జిల్లా ప్రజల్లో వుంది. 

మొత్తంగా ఇప్పటి వరకు జరిపిన పాదయాత్రలో నేను గమనించిన వాటిలో ముఖ్యమైనవేంటంటే.. ఎన్నికలు జరిగి అయిదునెలలవక ముందే ఇసుక కొరత, అమరావతి,  పోలవరం రీటెండర్లు, గృహ నిర్మాణాలు ఆపివేయడం వంటి అంశాలపై ప్రభుత్వంపై ప్రజలు అసంతృప్తిగా వున్నారు. అధికార పార్టీ,  ప్రతిపక్ష తెలుగుదేశం దొందూ దొందే అనే అభిప్రాయం ఉంది. విభజన తరువాత రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి అయిదేళ్ల అమూల్యమైన కాలాన్ని తెలుగుదేశం ప్రభుత్వం దుర్వినియోగం చేస్తే, ప్రస్తుత ప్రభుత్వం అన్నిటికీ రివర్స్ మంత్రం జపిస్తూ ఎక్కడ ప్రాజెక్టులక్కడే నిలబడిపోయే పరిస్థితి తెచ్చిందంటున్నారు. ప్రాంతీయపార్టీల కంటే బలమైన జాతీయ పార్టీతోనే దేశాభివృద్ధి, రాష్ట్రాభివృద్ధి జరుగుతుందనే భావన క్రమంగా పెరుగుతోంది. 

దీపావళి తరువాత నా పాదయాత్ర నెల్లూరు, గుడివాడ, పామర్రు ప్రాంతాల్లో కొనసాగుతుంది. ఈ నెల 31 వరకు ఈ  యాత్రలు జరుగుతాయి.  ప్రజలంతా కూడా ఈ యాత్రల్లో పాల్గొని విజయవంతం చేయాలి. మీ ప్రాంతాల్లో వుండే  ప్రధాన సమస్యలేమైనా వుంటే వాటిని మా దృష్టికి తీసుకొస్తే  పరిష్కారానికి కృషి చేస్తాం. చివరగా మరొక్కమారు గుర్తు చేస్తున్నా. గ్రామ రాజ్యమే రామ రాజ్యం.. గాంధీ మార్గమే మనందరి మార్గం.

 


11-11-2019 | 0 | 8

 

 

The ongoing Gandhi Sankalpa Yatra has been a great way for me to connect with the people and understand their problems. For the past couple of weeks, I have extensively toured some constituencies and walked through various villages to reach out to the people. 

 

The purpose of this Yatra as underlined by our Prime Minister Sri Narendra Modi was to spread the message of ‘Bapu’ amongst the people. The whole world is celebrating the 150th birth anniversary of Bapu this year and there cannot be a better occasion for us to rise up and fight against various evils in the society. Among some of these evils, regionalism and dynastic politics are some of the greatest challenges that the two Telugu states are facing. 

To help people out of this and to get to understand them better, Bharatiya Janata Party came up with this initiative of Gandhi Sankalpa Yatra and I must say I am delighted at the success this Yatra has been. 

 

The Gandhi Sankalpa Yatra has been a tremendous success and the people of Andhra Pradesh have indicated that they are ready for a change and put a stop on certain groups which are obstructing the state’s progress. 


Bharatiya Janata Party represents democracy in the truest sense where even a common party worker has a voice and can rise up to the highest of positions within the party. We have seen a Chaiwala become the Prime Minister, a feat that no other party could have facilitated. It was only because of Sri Narendra Modi’s focus and dedication to the cause of people that helped him to rise through the ranks. 

This is the system that needs to be implemented universally where elected representatives are continuously striving for the benefit of the people and not for themselves or their families. Mahatma Gandhi always preached simplicity and asked the leaders to only work towards the welfare of the nation. This is a message that over the years has been forgotten by some leaders and Gandhi Sankalpa Yatra is a great way to remind them as well as the people of the teachings of Bapu.

 


Next

Stay connected