నిజా - నిజాలు

శ్రీ వైఎస్ చౌదరి గారు 1986 నుంచి పలు పరిశ్రమల వ్యవస్థాపకుడుగా సుపరిచితం. పారిశ్రామిక విధానాలను కొనసాగించటంలో గొప్ప నాయకత్వ లక్షణాలు కలిగివున్నారు. స్నేహశీలియైన వ్వ్యాపారవేత్తగా వృత్తిపరమైన గౌరవంతో సమాజంలో అత్యున్నతస్థాయిలో నిలిచారు. వ్యాపారంలో స్నేహపూర్వక సహకారాన్ని అందించటంలో చౌదరిగారిది అరుదైన వ్యక్తిత్వం. వ్యాపార రంగంలో అపార అనుభవంతోపాటు పారిశ్రామిక విధానాలు, అభివృద్ధిలో అంతర్జాతీయ స్థాయిలో ప్రభావితం చేయగలిగిన వాణిజ్యవేత్తగా చౌదరి గారు నిలిచారు. పరిశ్రమలు, రాజకీయాలతోపాటు మన దేశ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడటంలో ఆయన ప్రధాన భూమికను పోషించారు.

పారిశ్రామికవేత్తగా నిజాయితీ నిబద్దత కలిగిన వాణిజ్యవేత్తగా పేరొందిన శ్రీ సుజనా చౌదరి గారు రాజకీయాల్లోకి అడుగుపెట్టాక వివాదాలతో ముడిపెట్టే ప్రయత్నం జరుగుతోంది. రాజకీయ శత్రువులు అసూయతో, కుట్రలతో, కక్షసాధింపులతో చౌదరి గారి పేరును చెడగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. రాజకీయాలలో బలమైన నేతగా ఎదిగిన చౌదరి గారిపై ఇంట, బయట విమర్శల దాడి చేస్తుండటం విచారకరం.

1986 నుంచి 2000 సంవత్సరం వరకు వ్యాపార, పారిశ్రామిక రంగంలో ఎటువంటి మచ్చలేని పారిశ్రామికవేత్తగా చౌదరి గారికి ప్రత్యేక గుర్తింపు ఉంది. 2000 సంవత్సరం తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టిన నాటి నుండి కొందరు నిరాధార, నిందారోపణలు, దూషణలు, విమర్శలు చేసే ప్రయత్నం జరుగుతుంది. 

2005 సంవత్సరం నుండి తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా మారిన తర్వాత శ్రీ చౌదరి గారు రాజకీయ విరోధులకు లక్ష్యంగా మారారు. శ్రీ చౌదరి గారు రాజకీయాలలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ లో దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి గారి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఆసమయంలో చౌదరి గారు టీడీపీలో కొనసాగుతున్నారు. దీంతో ఆయనను పరోక్షంగా అడ్డుకునేందుకు సుజనా గ్రూప్‌పై పన్నుల ఎగవేత, అవకతవకల పేరుతో విచారణ ప్రారంభించారు. సుదీర్ఘంగా విచారణ జరిగినా సుజనా గ్రూపు కంపెనీలు అవకతవకలకు పాల్పడలేదని, నిజాయితితో నడుస్తున్నాయని తేలింది.

గ్రూప్‌ సక్రమంగా నడుస్తున్నా, విచారణలో ఏ తప్పు కనుగొనలేకపోయినప్పటికీ, ప్రభుత్వానికి మద్దతుగా ఉన్న అనేక మీడియా సంస్థలు, సొంత మీడియా చౌదరి గారి పై బుదరజల్లే ప్రయత్నం చేయించింది. శ్రీ చౌదరి గారి వ్యాపారాలపై నిరాధార ఆరోపణలు చేయడానికి మీడియాను విచ్చలవిడిగా వినియోగించింది.

శ్రీ చౌదరి గారి వ్యక్తిత్వాన్ని, వ్యాపారాలను దెబ్బతీసే లక్ష్యంతో తప్పుడు, నిరాధార సమాచారంతో సొంత మీడియాతో ప్రచారం చేయించారు. ప్రధానంగా హైదరాబాద్ నుండి వెలువడే కొన్ని తెలుగు, ఆంగ్ల పత్రికలు తప్పుడు సమాచారాన్ని ప్రచురించాయి. ఆ తర్వాత వచ్చిన ఎలక్ట్రానిక్ మీడియా కూడా ఇదే బాటలో చౌదరి గారిపై తప్పుడు కథనాలు ప్రచారం చేశాయి. మీడియాలో వచ్చిన ప్రతి ఆరోపణలకు శ్రీ చౌదరి గారు ఎప్పటికప్పుడు వివరణలు ఇచ్చేలా జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా బురద జల్లడం జరిగింది.

మీడియాలో ప్రసారం చేయబడిన కథనాలలో ఏ ఒక్క దానికి ఆధారాలు లేవు, కానీ చౌదరి గారిపై నిరాధార ఆరోపణలు చేసే ప్రయత్నం మాత్రం కొనసాగింది. 

శ్రీ చౌదరి గారు పార్లమెంటు సభ్యునిగా, కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా మారిన తర్వాత దాడులు మరింత ఉధృతంగా మారాయి. రాజకీయ కక్షసాధింపులతో చౌదరి గారిపై మీడియా దాడి కొనసాగినా ప్రజల నుంచి ఏ వ్యతిరేకత రాకపోవటం ఆయన నిజాయితి, నిబద్దతకు నిదర్శనం. శ్రీ చౌదరి గారి వ్యక్తిగత, వృత్తిగత, రాజకీయ పరమైన నిజాయితీ గ్రహించిన సన్నిహితులు, శ్రేయోభిలాషులు ఆయనపై వచ్చినా ఆరోపణలను తేలికగా కొట్టిపారేయటం గమనార్హం.

వాస్తవానికి కొన్ని వ్యాపార సంస్థలపై బ్యాంకుల రుణాలు ఎగవేతకు సంబంధించిన కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ, చౌదరి గారిపై ఎటువంటి కేసులు, బ్యాంకుల లావాదేవీలకు సంబంధించి వ్యక్తిగత ఆరోపణలు లేవు. అసలు 2014 తర్వాత చౌదరి స్థాపించిన ఏ కంపెనీలోనూ ఆయన ఎటువంటి పదవులు నిర్వర్తించటం లేదు.  

సుజనా చౌదరి గారి జీవితాన్ని మరోమారు సుదీర్ఘంగా అవలోకనం చేయటం జరిగింది. ఈ నేపధ్యంలో పారదర్శకత, జవాబుదారీతనం స్ఫూర్తిగా శ్రీ చౌదరి గారి నిజాయితీ, నిబద్దతకి సంబంధించిన విషయాలను మరోమారు స్పష్టం చేసే ప్రయత్నం ఈ వేదికలో జరిగింది.

3905686-200

పారిశ్రామికవేత్తగా నిజాయితీ నిబద్దత కలిగిన వాణిజ్యవేత్తగా పేరొందిన శ్రీ సుజనా చౌదరి గారు రాజకీయాల్లోకి అడుగుపెట్టాక వివాదాలతో ముడిపెట్టే ప్రయత్నం జరుగుతోంది.

సీబీఐ కేసు
Allegations & Responses
అమరావతి భూములు
teTelugu