కేంద్ర సహాయ మంత్రి

శ్రీ చౌదరి గారు తన రాజకీయ ప్రస్థానాన్ని ఆలస్యంగా ప్రారంభించినప్పటికీ చాలా తక్కువ సమయంలోనే పార్టీలో ముఖ్యనేతగా ప్రధాన భూమిక పోషించారు. ప్రధానంగా కేంద్ర మంత్రివర్గంగా ఎన్నుకోబడటం ప్రత్యేకతను సంతరించుకుంది.

భారతీయ జనతా పార్టీ (BJP) నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ ఫ్రంట్ (NDA) కూటమి 2014 పార్లమెంట్ ఎన్నికల్లో విజయదుంధుభి మోగించింది. ఎన్టీఏలో కూటమి భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ(టిడిపి)కి నరేంద్ర మోడీ మంత్రివర్గంలో రెండు మంత్రి పదవులు లభించాయి.

టీడీపీ నుంచి కేంద్ర మంత్రివర్గంలోకి చేరిన ఇద్దరు ఎంపీలలో శ్రీ వైఎస్ చౌదరి గారు ఒకరు. 

2014, నవంబర్ 9న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ ఫ్రంట్ (NDA) ప్రభుత్వం మొదటి మంత్రివర్గ విస్తరణలో భాగంగా శ్రీ YS చౌదరి గారు సైన్స్ & టెక్నాలజీ మరియు ఎర్త్ సైన్సెస్ రాష్ట్ర మంత్రిగా నియమితులయ్యారు.

2016లో కూడా రెండోసారి వైఎస్ చౌదరి రాజ్యసభ సభ్యుడిగా పార్లమెంటుకు తిరిగి ఎన్నికయ్యారు. తద్వారా టీడీపీ అభ్యర్థిగా రెండవసారి ఆంధ్రప్రదేశ్‌కు చౌదరి గారు ప్రాతినిధ్యం వహించారు. జూన్ 4, 2014న తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ (టీడీపీ) నాయకుడిగా కూడా బాధ్యతలను చేపట్టారు.

శాస్త్ర సాంకేతిక కేంద్ర మంత్రిత్వ శాఖ, శాస్త్ర సాంకేతికలో కొత్త ఆలోచనలను మరియు ఆవిష్కరణలు ప్రోత్సహించడానికి బాధ్యత వహిస్తుంది మరియు దేశవ్యాప్తంగా శాస్త్ర సాంకేతిక కార్యక్రమాలను నిర్వహించడం, సమన్వయం చేయడం మరియు అభివృద్ధి చేయడం కోసం ఒక నోడల్ విభాగంగా వ్యవహరిస్తుంది.

వాతావరణ పరిస్థితులు, భౌగోళిక పరిస్థితులు, సముద్ర స్థితిగులు, భూకంపాలు, సునామీలు, భూ వ్యవస్థలకు సంబంధించిన సమగ్రమైన పరిశోధనలు, అంచనాలు వేయడంలో దేశానికి అత్యుత్తమ సేవలను అందించే బాధ్యతను ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖకు అప్పగించారు. సముద్ర వనరుల అన్వేషణ కోసం సైన్స్ మరియు టెక్నాలజీకి సంబంధించిన విషయాలను కూడా మంత్రిత్వశాఖ పర్యవేక్షిస్తుంది. ఇందులో భాగంగానే సముద్ర పరిశోధనలో కీలక పాత్ర పోషిస్తుంది.

2030 నాటికి నోబెల్ బహుమతిని గెలుచుకునేల భారత పరిశోధకుల సామర్థ్యాలు అవకాశాలు ఉండాలని ఆకాంక్షించిన మొట్టమొదటి మంత్రిగా శ్రీ YS చౌదరి గారు బాధ్యతలు తీసుకున్నారు. ప్రముఖ భారతీయ విద్య, ప్రధాన పరిశోధన సంస్థల భాగస్వామ్యంతో అనేక ప్రాజెక్టులలో సహకరించడానికి క్రాస్-ఫంక్షనల్ బృందాలను కూడా మంత్రిగా వైఎస్ చౌదరి ప్రారంభించారు.

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా (SCS) అంశంతో 2018లో టిడిపి కేంద్ర మంత్రివర్గం నుంచి వైదొలిగింది. మార్చి 8, 2018న, నరేంద్ర మోడీ ప్రభుత్వంలోని ఇద్దరు తెదేపా మంత్రులు అశోక్ గజపతి రాజు, వైఎస్ చౌదరి గారు కేంద్ర మంత్రి పదవులకు రాజీనామాలు సమర్పించారు. అప్పటి ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు బిజెపి నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ ఫ్రంట్ (NDA) కూటమికి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు.

తదనంతర ఏర్పడిన రాజకీయ పరిణామాలలో జూన్ 20, 2019న రాజ్యసభలో తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ బిజెపిలో విలీనమైంది. తత్ఫలితంగా, శ్రీ చౌదరి గారు సభలోని మరో ముగ్గురు సహచరులతో కలిసి బిజెపి సభ్యులుగా మారారు.

శ్రీ వైఎస్ చౌదరి 2014 నుండి 2018 వరకు మూడు సంవత్సరాల నాలుగు నెలల పాటు శాస్త్ర సాంకేతిక మరియు భూ విజ్ఞాన శాఖ సహాయ మంత్రిగా కేంద్ర మంత్రి వర్గంలో కొనసాగారు.

3905686-200

By infusing a new dynamism into his ministry, Shri Chowdary made a mark as the Minister of State in the Union Council during 2014-2018.

teTelugu