సమాజాభివృద్ధిలో సుజనా గారు

సుజనా ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిర్వహించబడుతున్న సుజనా ఫౌండేషన్ బలహీన వర్గాల విద్య, వైద్య, ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించింది. సుజనా గ్రూప్ పేదలకు అందిస్తున్న సేవలను సామాజిక బాధ్యతగా భావిస్తుంది. అందుకే ప్రత్యేక కార్యక్రమాల రూపకల్పన ద్వారా ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన వారికి సహాయం అందించటంలో సుజనా ఫౌండేషన్ ముందుంటుంది.

చౌదరి గారి మానవతా దృక్ఫధం సుజనా ఫౌండేషన్ పేదల పక్షానికి నిలిచేలా చేస్తుంది. ఎన్టీఆర్ ట్రస్ట్ ఫౌండేషన్‌తో సహకారంతో సుజనా ఫౌండేషన్ ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామీణ, చిన్న పట్టణ ప్రాంతాలలో సేవలను కొనసాగిస్తుండటం అధికంగానే ప్రభావాన్ని చూపిస్తుంది. ప్రధానంగా సామాజిక కార్యక్రమాల ద్వారా సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లను అందించడం, ఆడపిల్లల ప్రయోజనాల కోసం వారికి ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత విద్యను అందించడం కోసం సుజనా ఫౌండేషన్ సేవలు అజరామరంగా నిలుస్తున్నాయి. 

సేవే మార్గంగా, ఇతర లాభాపేక్షను ఆశించకుండా సామాజిక కార్యక్రమాల నిర్వహణకు ప్రత్యేక విధానాన్ని సుజనా ఫౌండేషన్ పాటిస్తుంది. ఈ విధానం ద్వారా పేద, మధ్య తరగతి, బలహీన వర్గాల అభివృద్ధి కోసం వారి సమస్యలను గుర్తించడం, వాటిని పరిష్కరించటం జరుగుతుంది. అదేవిధంగా సమస్యల పరిష్కారంతోపాటు సహాయం అందించడం కోసం నిర్దిష్ట వ్యవధిలో ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించింది. ఈ విధానంలో భాగంగానే వెనుక బడిన వర్గాలలో నైపుణ్యాన్ని వెలికితీసి వారి భవిష్యత్తు మరియు అభివృద్ధి కోసం సుజనా ఫౌండేషన్ పాటుపడుతోంది.

సేవా కార్యక్రమాలలో ట్రస్ట్ మరియు ఫౌండేషన్ ప్రాధాన్యతలు మూడు విభాగాలుగా విభజించబడ్డాయి. అవి ఆరోగ్య సంరక్షణ, వ్యవస్థాపక అభివృద్ధి, మరియు సమాజాభివృద్ధి.

కార్యకలాపాలు

సుజనా గ్రూప్ CSR లక్ష్యాలను సుజనా ఫౌండేషన్ ద్వారా నెరవేర్చు తున్నా రు. ఫౌండేషన్ ద్వారా అనాథలు, అణగారిన వర్గాల పిల్లలు, రోగులు, తుఫాను బాధితుల కోసం ప్రత్యే క కార్యకలాపాలను చేపడుతుంది. విద్యలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు సుజనా ఫౌండేషన్ బంగారు పతకాలను కూడా ప్రధానం చేస్తోంది. పేద, వెనుకబడిన పిల్లల విద్యను ప్రోత్సహించడానికి సుజనా ఫౌండేషన్ స్కాలర్షిప్లను కూడా అందిస్తోంది. అంతేకాదు సుజనా ఫౌండేషన్ మహిళల సాధికారతకు వెన్ను దన్ను గా నిలుస్తోంది.

  • వృత్తి నైపుణ్యాభివృద్ధి & అనాథ శరణాలయాల నిర్వహణ కేంద్ర ప్రభుత్వ యొక్క చొరవను దృష్టిలో పెట్టుకొని మరియు యువతకు వృత్తి నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందించటం ద్వారా వారికి ఉద్యోగ, ఉపాధి కల్పన కల్పిచటంపై సుజనా ఫౌండేషన్ ప్రత్యేకంగా దృష్టి సారించింది. అదేవిధంగా అనాధ శరణాలయాల నిర్వహణపై ప్రత్యేక విధానాలను రూపొందించింది. దేశంలోని పేరొందిన ఎన్జీవోలతో కలిసి వృత్తి నైపుణ్యం, అనాధ శరణాల నిర్వహణను సమర్ధంగా నిర్వహించటంలో సుజనా ఫౌండేషన్ ప్రధాన భూమికను పోషిస్తుంది.
  • విద్యకు ప్రోత్సాహం వెనుకబడిన వర్గాల పిల్లల జీవితాలలో విద్యాభ్యాసంతో వెలుగులు నింపటానికి ఫౌండేషన్ ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. ఇందులో భాగంగా స్కాలర్‌షిప్‌లు, ఫెలోషిప్‌లు మరియు ఆర్థిక సహాయంతో నిరుపేద విద్యార్ధులకు అండగా నిలుస్తుంది. సుజనా ఫౌండేషన్, స్వర్ణ భారత్ ట్రస్ట్ నిర్వహిస్తున్న నెల్లూరు స్వర్ణ భారత విద్యా మందిర్‌ లో విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థులకు పోషకాహారంతో కూడిన భోజనాన్ని అందించడానికి నిధులను సమకూరుస్తోంది. పేద, అణగారిన రైతుల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలనే సంకల్పంతో ఈ పాఠశాల ప్రారంభించబడింది. ఇందులో భాగంగానే మధ్యాహ్న భోజన పథకంతోపాటు పిల్లలు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరయ్యేలా ప్రోత్సహించడం జరుగుతోంది. 2014-15 విద్యా సంవత్సరంలో 9 అనాథాశ్రయాలకు చెందిన 120 మంది వెనుకబడిన విద్యార్థులకు సుజనా ఫౌండేషన్ పాఠశాల ఫీజును భరించి వారికి సహకరించడం జరిగింది.
  • సుజనా సందేశాత్మక ప్రసంగాలు నిరుపేదలకు విద్యతోపాటు వారి అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళికను తయారు చేయటం జరిగింది. దేశంలోనే వారిని నిష్ణాతులను చేయటంలో భాగంగా విద్య, కార్యనిర్వహణ, తత్వశాస్త్రం మరియు ఆధ్యాత్మిక రంగాలలో ముద్ర వేసిన అనుభవజ్ఞులైన వక్తలను ఆలోచింపజేసే సుజనా ఉపన్యాసాలను ఈ మేనిఫెస్టోలో పొందుపరచటం జరిగింది.
    1. సుజనా సందేశాత్మక ప్రసంగం, శ్రీ స్వామి సమర్పణానంద,ఆధ్యాత్మికవేత్త, రామకృష్ణ మిషన్, ప్రొఫెసర్ - వివేకానంద విశ్వవిద్యాలయం, RK మిషన్, కోల్‌కతా. గెస్ట్ ఫ్యాకల్టీ - IIT ఖరగ్‌పూర్ మరియు IIM ఇండోర్ వారి ద్వారా సుజనా సందేశాత్మక ప్రసంగం
    2.  డాక్టర్ జి.వి.జి. కృష్ణ మూర్తిమాజీ కేంద్ర ఎన్నికల కమిషనర్ గారి ద్వారా సుజనా సందేశాత్మక ప్రసంగం
    3.  డాక్టర్ మృత్యుంజయ్ ఆత్రేయమేనేజ్‌మెంట్ కన్సల్టెంట్ & బిజినెస్ స్ట్రాటజిస్ట్ గారి ద్వారా సుజనా సందేశాత్మక ప్రసంగం
  • సుజనా ఉత్తమ పురస్కారాలు వివిధ రంగాలలో ఉత్తమ సేవలు అందించినందుకు గాను వారికి ఈ అవార్డులను అందించటం జరుగుతుంది. వ్యవసాయం, విద్య, గ్రామీణ పారిశ్రామికవేత్తలు, ఇంజనీరింగ్ ఉత్పత్తుల తయారీలు, ఆవిష్కరణల రంగాల్లో సేవలు అందించిన వారిని ప్రోత్సహించే రీతిలో ఫౌండేషన్ ఈ పురస్కారాలను అందిస్తుంది. 2012 నుండి ప్రత్యేక జ్యూరీ ఎంపిక చేసిన వ్యక్తులకు వార్షిక అవార్డుల పేరుతో 1,00,000 రూపాయల నగదు, జ్ఞాపిక, శాలువాతో సత్కరిస్తుంది.
  • మాట్లాడుకుందాం (యువజన కార్యక్రమం సుజనా ఫౌండేషన్ హైదరాబాద్‌లోని మల్లా రెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో, హైదరాబాద్‌లోని లక్డికాపూల్‌లోని ఐఐఎం (వాసవి) కాలేజీలో “లెట్స్ టాక్ (మనం మాట్లాడుకుందాం)” అనే యువజన కార్యక్రమాన్ని నిర్వహించింది. యువతలోని ఆలోచనలను చైతన్యవంతం చేసి, వారిని వెలికితీసి వారంతా ప్రజాస్వామ్య విలువలను పెంచటం కోసం ఓటు వేసే దిశగా నడిపించేందుకు ఈ కార్యక్రమం రూపొందించబడింది. డా. పరకాల ప్రభాకర్ (ప్రముఖ వ్యాఖ్యాత మరియు విశ్లేషకులు), Mr.K.V.ప్రదీప్ (నటుడు మరియు అంతర్జాతీయ సాఫ్ట్ స్కిల్ ట్రైనర్) వంటి ప్రముఖ వక్తలచే ఈ చర్చలను నిర్వహించటం జరిగింది.
  • సుజనా బంగారు పతకాలు 2012 జనవరిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇంజినీరింగ్ అకడమిక్స్‌లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన ప్రతి ఒక్కరినీ గుర్తించి, వారిని సత్కరించటానికి సుజనా ఫౌండేషన్ గోల్డ్ మెడల్స్ ప్రకటించింది. సుజనా గ్రూప్ సిల్వర్ జూబ్లీ వేడుకలను పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. వార్షిక ప్రాతిపదికన ఈ అవార్డులు ఇంజనీరింగ్ లో మాత్రమే కాకుండా ఇతర రంగాలలో అభివృద్ధి కార్యకలాపాలలో రాణించిన వారికి కూడా అందిస్తున్నారు.
  • COWE (కాన్ఫెడరేషన్ ఆఫ్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్) కు స్పాన్సర్‌షిప్ WISE, 2014 – మహిళా అంతర్జాతీయ సమ్మిట్ ఆన్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ లో, ఔత్సాహిక యువ మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు వివిధ విశ్వవిద్యాలయాలో విద్యాభ్యాసం చేస్తున్న 100 మంది విద్యార్ధినులకు స్కాలర్షిప్ అందించేందుకు సుజనా ఫౌండేషన్ చొరవ తీసుకుంది. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో 2014 అక్టోబర్ 18, 19వ తేదీలలో జరిగిన సదస్సులో ఈ నిర్ణయం తీసుకోవటం జరిగింది.
  • సుజనా & మెడిసిటీ వైద్య శిబిరం సుజనా ఫౌండేషన్ మెడిసిటీ హాస్పిటల్‌తో కలిసి హైదరాబాద్ మరియుె చుట్టుపక్కల ప్రాంతాలలో వివిధ వైద్య మరియు రక్త దాన శిబిరాలను నిర్వహించింది. సెప్టెంబరు 2013 నుండి అక్టోబర్ 2014 వరకు సుజనా ఫౌండేషన్ 60కి పైగా వైద్య శిబిరాలు నిర్వహించింది. వివిధ గ్రామీణ ప్రాంతాల్లో ఈ వైద్య శిబిరాలు నిర్వహించబడ్డాయి. ఈ వైద్య శిబిరాల ద్వారా 12,357 మందికి లబ్ది చేకూరింది.
  • ఐడీఏ బొల్లారంలో ఆసుపత్రి ప్రారంభోత్సవం హైదరాబాద్ సమీపంలో పారిశ్రామిక ప్రాంతాలలో నివశించే పేదలకు వైద్యం, ఆసుపత్రులలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంలో భాగంగా సుజనా ఫౌండేషన్ సికింద్రాబాద్‌లోని బొల్లారంలోని IDAలోని ఆసుపత్రికి బల్లలు, కుర్చీలు, పడకలు, మంచాలను విరాళంగా అందించింది. సుజనా ఫౌండేషన్ సాయంతో IDA ఆసుపత్రిలో ఎక్కువ మంది రోగులు నాణ్యమైన వైద్యాన్ని పొందే అవకాశం కల్పించటం జరిగింది. అలాగే ID A సిబ్బందితోపాటు ఆసుపత్రిలో చికిత్సలు పొందుతున్న రోగులకు నాణ్యమైన ఆరోగ్యాన్ని, సౌకర్యాలను అందిస్తుంది. ఆస్పత్రికి అందించిన విరాళాలకుగాను సుజనా ఫౌండేషన్ ప్రశంసలు అందుకుంది.
  • వెనుకబడిన వర్గాల పిల్లల కోసం ప్రత్యేక కార్యక్రమం అణగారిన వర్గాలు, అనాథల కోసం సుజనా ఫౌండేషన్ 3 హెచ్‌లు - హెయిల్ (Hail), హెల్తీ (Healthy) అండ్ హ్యాపీ (Happy) అనేది విధానాన్ని తీసుకు వచ్చింది. హైదరాబాద్ మరియు చుట్టుపక్కల ఉన్న 70 అనాథాశ్రమాలు, 3000 పైగా పేద పిల్లలకు ఈ విదానాన్ని చేరువచేయటం కోసం సర్వే చేయబడింది. అనంతరం చిన్నారులకు ప్రత్యేక వైద్య శిబిరాన్ని నిర్వహించారు. 10 మంది వైద్యులతో కూడిన ఈ బృందం నిరుపేద చిన్నారుల ఆరోగ్య సమస్యలను పరీక్షించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. చిన్నారులకు 2 గంటల వినోద కార్యక్రమాలతోపాటు ఆరోగ్యకరమైన భోజనం కూడా అందించబడింది.

కార్యక్రమాల వెనక దాగి ఉన్న నిజాయితీ మరియు నిస్వార్థపు ఆలోచన:

    1. పిల్లల జీవితాల్లో చిరునవ్వులు చిందించటం, వారికి మంచి ఆరోగ్యాన్ని అందించటం.
    2. పిల్లలు ఆరోగ్య సమస్యలు, ప్రాథమిక అవసరాలను అర్థం చేసుకోవడానికి దాతలతో కూడిన సరైన వేదికను కల్పించడం.
    3. ప్రతి బిడ్డకు కనీస సౌకర్యాలు అందేలా చూడటం ద్వారా వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం.
    4. అదే సమయంలో మీడియా ద్వారా ప్రజల్లో సామాజిక బాధ్యతను మేల్కొల్పటం.
  • మంచి నీటి శుద్దీకరణ యంత్రం సమాజ అభివృద్ధిలో భాగంగా మెదక్ జిల్లా సదాశివపేట మండలం కంబాలపల్లి గ్రామంలో సుజనా ఫౌండేషన్ SMPL సహకారంతో RO వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించేందుకు విరాళాలు అందించింది. ఈ RO వాటర్ ప్లాంట్ ద్వారా గ్రామంలోని 300 కుటుంబాల తాగునీటి అవసరాలను తీరుస్తుంది.
  • విశాఖపట్నంలో తుఫాను సహాయక చర్యలు విశాఖపట్నంలో తుఫాను బాధిత కుటుంబాలకు సుజనా ఫౌండేషన్‌ సహాయం అందించింది. ఫౌండేషన్ కు చెందిన 25 సహాయక బృందాలు ప్రతి బాధిత కుటుంబానికి 9 రకాల వస్తువులను పంపిణీ చేశాయి. విశాఖపట్నంలో తుఫాను సహాయ కార్యక్రమం ద్వారా 5000 కుటుంబాలకు సుజనా ఫౌండేషన్ సాయం అందించింది. తుఫాను సహాయ కార్యక్రమాలలో భాగంగా విశాఖపట్నంలోని 25 గ్రామాలకు (15 గ్రామాలు సుజనా పరిశ్రమ యూనిట్ల పరిధిలో ఉన్నాయి) సాయం అందించటం జరిగింది. ప్రధానంగా విశాఖపట్నంలోని గాజువాక, పెద్ద జాలరిపేట ప్రభావిత ప్రాంతాల్లో ఇంటింటికీ ఆహారం, నీరు, మందులు, టార్పాలిన్, దుప్పట్లు, ఇతర నిత్యావసరాలను పంపిణీ చేశారు.
  • విశాఖపట్నంలో వైద్య శిబిరం మేముసైతం(అందరికీ కోసం), అభయహస్తం (హెల్పింగ్ హ్యాండ్) విధానంతో AP హోమియోపతి మందుల తయారీదారుల సంఘం సహకారంతో సుజనా ఫౌండేషన్ విశాఖపట్నంలో 60 వేల కుటుంబాలకు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించింది. హుదూద్‌ సహాయక చర్యల్లో భాగంగా ఉచితంగా మందులను అందజేసింది.
  • కోవిడ్-19లో సహాయ సహకారాలు మానవాళికే సవాలుగా మారిన కోవిడ్-19 మహమ్మారి సమయంలో సుజనా ఫౌండేషన్ ఎటువంటి ఖర్చు లేకుండా రోగులకు ఉచిత COVID-19 చికిత్స సౌకర్యాన్ని కల్పించింది. ఈ సదుపాయంలో ఆక్సిజన్ సరఫరాతో కూడిన 150కిపైగా పడకలతో ఆస్పత్రి సదుపాయాలను అందించింది. ఇది సమగ్ర ఆరోగ్య సంరక్షణకు భరోసాను ఇచ్చింది. రోగులకు ఉచితంగా మందులు అందించబడ్డాయి., రోగులకు వారి సహాయకులకు కూడా పౌష్టికాహారం అందించబడింది. ఇటువంటి సేవాతత్పరత సుమారు 200 మంది రోగుల జీవితాలలో వెలుగులు నింపింది. అటువంటి క్లిష్టమైన సమయంలో అత్యవసర ఆరోగ్య సేవలను అందించటం ద్వారా ఫౌండేషన్ సేవాభావం నిబద్ధతను బయటకు తెచ్చింది. ఫౌండేషప్ సేవ కార్యక్రమాలు ప్రజల ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపించింది.
  • కోవిడ్-19 సమయంలో కిరాణా కిట్‌ల పంపిణీ అవసరమైన సమయాల్లో అన్ని వర్గాలకు సాయపడటంలో సుజనా ఫౌండేషన్ ముందు వరుసలో ఉంది. సవాలుగా మారిన COVID-19 మహమ్మారి సమయంలో సుజనా ఫౌండేషన్ 20 వేల కరోనా కిట్‌లను పంపిణీ చేయటం జరిగింది. 800 విలువైన సహాయక కిట్లను వీధి వ్యాపారులు. రోజువారీ కూలీల కుటుంబాలకు అందచేశారు. ఒక్కో కిట్ లో 5 కేజీల బియ్యం, పప్పు, గోధుమ పిండి, నూనె, కిరాణా సామాగ్రి వంటి నిత్యవసర వస్తువులను అందించారు. అదేవిధంగా కోవిడ్ మహమ్మారి బారిన పడిన కుటుంబాలకు పౌష్టికాహారం కూడా అందించటం జరిగింది. సమాజశ్రేయస్సు కోసం ఫౌండేషన్ చేసిన సేవ అత్యవసర సమయాలలో అట్టడుగు వర్గాలు కష్టాల నుంచి బయటపడటానికి దోహదపడింది. ఇటువంటి సహాయ సహకారాల ద్వారా ఫౌండేషన్ సేవలకు ప్రశంసలు అందాయి.
  • కోవిడ్-19లో మిర్చి రైతులకు విత్తనాల పంపిణీ కోవిడ్-19 మహమ్మారి సమయంలో రోడ్డున పడిన రైతన్నలకు సుజనా ఫౌండేషన్ మిర్చి విత్తనాలను పంపిణీ చేసి మళ్లీ వారిలో పునరుత్తేజం కలిగించింది. 5 వేల మంది రైతులకు విత్తనాలను అందించటం ద్వారా వారి జీవితాలలో వెలుగులను నింపింది. ఒక్కో ప్యాకెట్ ధర రూ. 1250 ఉన్నా రైతుల సంక్షేమం దృష్ట్యా సేవభావంతో ఫౌండేషన్ ముందుకు వచ్చి వారి అవసరాలకు మద్దతుగా నిలిచింది. విత్తనాల పంపిణీ చేయటంతో రైతులు తిరిగి తమ సాగును ప్రారంభించటం జరిగింది. ఈ క్లిష్ట సమయాల్లో వ్యవసాయ సమాజానికి సహాయం చేయడం ద్వారా ఫౌండేషన్ యొక్క నిబద్ధత ఈ రైతుల జీవనోపాధి మరియు స్థిరత్వంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. ఫౌండేషన్ దక్షిణ భారతదేశంలోని అనేక పాఠశాలలు మరియు కళాశాలలకు సహాయాలతో పాటు శారీరకంగా మరియు మానసికంగా వికలాంగులైన పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడం వంటి అనేక కార్యక్రమాలకు మద్దతుగా నిలుస్తోంది.

The Foundation also supports and runs several programs like providing quality education for the physically and the mentally challenged children across South India, besides general support for several schools and colleges in the region.

  • ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పరీక్ష కిట్లు (సామాగ్రి) విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పాఠ్యపుస్తకాలు, పరీక్ష ప్యాడ్‌లతో కూడిన పరీక్ష కిట్‌లను పంపిణీ చేయడం జరిగింది. 10 వేల మంది విద్యార్థులకు ఫౌండేషన్ ద్వారా ప్రత్యక్షంగా లబ్ది చేకూరింది, ఇది వారి అనుభవంపై గణనీయమైన ప్రభావం చూపించింది. సుమారు రూ. 3,00,000 లతో చేసిన ఈ కార్యక్రమం విద్యార్థులు పరీక్షలలో రాణించడానికి, వారి లక్ష్యాలను సాధించడానికి అవసరమైన సాధనాలను కలిగి ఉన్నారని నిర్ధారిస్తోంది. ఈ చొరవ విద్యను ప్రోత్సహించడానికి మరియు సమాజంలోని యువతకు సాధికారత కల్పించడానికి ఫౌండేషన్ యొక్క నిబద్ధతను ప్రతిబింబిస్తోంది.
  • రైతులకు టార్పాలిన్ల పంపిణీ వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడం, స్థానిక రైతులకు సాయం మందించటంలో సుజనా ఫౌండేషన్ ముందంజలో ఉంది. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని రైతులకు వర్షాకాలంలో తమ పంటను కాపాడుకునేందుకు 2,500 టార్పాలిన్లను పంపిణీ చేసింది. 4 వేల రూపాయిల విలువచేసే టార్పాలిన్లను అందించటం ద్వారా వర్షకాలంలో రైతులకు బలమైన మద్దతును ఇవ్వగలిగింది. ఇందులో భాగంగానే రైతుల అవసరాలని తీర్చటమే లక్ష్యంగా ముందుకు సాగింది. తదనుగునంగానే రైతులు పండిన పంటను రక్షించుకునేందుకు టార్పాలిన్లలు అందించటం జరిగింది. వ్యవసాయానికి సాయం ద్వారా రైతులపై ఫౌండేషన్ నిబద్దతను బయటపెట్టింది.
  • మహిళా సాధికారత కార్యక్రమం మహిళా సాధికారత, అభివృద్ధే లక్ష్యంగా ఫౌండేషన్ మహిళలకు ఉపాధి శిక్షణ అందిస్తోంది. మహిళలకు అనుభవజ్ఞులైన బోధకులచే టైలరింగ్ శిక్షణా కోర్సులను అందిస్తుంది. ప్రస్తుతం 40 మంది మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగా మరో 38 మంది స్త్రీలు శిక్షణను కొనసాగిస్తున్నారు. మహిళలకు వ్యక్తిగతంగా ఆర్థికంగా ఉపాధి, ఉద్యోగాల కల్పనలో భాగంగా ఇటువంటి వృత్తి నైపుణ్య శిక్షణలు అందిస్తోంది. అంతేకాకుండా మహిళకు సాధికారత కల్పించడం లక్ష్యంగా ముందుకు సాగుతుంది.

This program aims to empower women by providing them with valuable skills and opportunities for personal and financial growth. The successful completion of the program by 40 members is a testament to the effectiveness of our training and the commitment of these women to enhance their skills and create a better future for themselves. We are proud to continue supporting the 38 members who are actively participating in the program, and we look forward to witnessing their achievements as well.

  • నైపుణ్యాభివృద్ధి కేంద్రం సుజనా ఫౌండేషన్ నైపుణ్యాభివృద్ధి కేంద్రం నందిగామ ప్రాంతంలో C, C++ & Data Structures, Core Java, Core Python, MS-Office, DTP, మరియు Adobe Photoshopతో సహా వివిధ కోర్సుల్లో సాంకేతిక నైపుణ్యాలపై శిక్షణను అందిస్తుంది. అనుభవజ్ఞులైన అధ్యాపకులచే పూర్తి స్థాయి సదుపాయాలతో ఈ శిక్షణ అందిస్తుంది. ఇప్పటి వరకు ఈ కోర్సులలో 50 మంది శిక్షణ పొందగా, మరో 88 మంది విద్యార్థులు శిక్షణ కొనసాగిస్తున్నారు. ఈ శిక్షణ ద్వారా యువతలో సాంకేతిక వృత్తి నైపుణ్యాలను వెలికితీయటంతో పాటు వారికి ఉద్యోగ, ఉపాధి కల్పనలో ముందుకు తీసుకెళుతుంది.

సుజనా ఫౌండేషన్ నైపుణ్యాభివృద్ధి కేంద్రం నందిగామ ప్రాంతంలో C, C++ & Data Structures, Core Java, Core Python, MS-Office, DTP, మరియు Adobe Photoshopతో సహా వివిధ కోర్సుల్లో సాంకేతిక నైపుణ్యాలపై శిక్షణను అందిస్తుంది. అనుభవజ్ఞులైన అధ్యాపకులచే పూర్తి స్థాయి సదుపాయాలతో ఈ శిక్షణ అందిస్తుంది. ఇప్పటి వరకు ఈ కోర్సులలో 50 మంది శిక్షణ పొందగా, మరో 88 మంది విద్యార్థులు శిక్షణ కొనసాగిస్తున్నారు. ఈ శిక్షణ ద్వారా యువతలో సాంకేతిక వృత్తి నైపుణ్యాలను వెలికితీయటంతో పాటు వారికి ఉద్యోగ, ఉపాధి కల్పనలో ముందుకు తీసుకెళుతుంది.

  • ఉచిత వైద్య శిబిరాలు మరియు మందుల పంపిణీ అందరికీ సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించడమే ప్రాథమిక లక్ష్యంగా సుజనా ఫౌండేషన్ విజయవాడ పార్లమెంటు నియోజకవర్గంలో ఉచిత వైద్య శిబిరాలు మరియు మందుల పంపిణీని చేపట్టింది. వైద్య శిబిరాలలో భాగంగా రక్తపోటు, మధుమేహం, ECG పరీక్షలు, ఎత్తు, బరువు వంటి ఆరోగ్య పరీక్షలను చేయడం జరిగింది. ఈ వైద్య శిబిరాలలో దాదాపు 4 వేల మంది పాల్గొని వారి ఆరోగ్య సమస్యలపై అవగాహనతోపాటు ఉచితంగా మందులను అందుకున్నారు. పేద ప్రజలు తమ ఆరోగ్య సమస్యలను ముందస్తుగానే తెలుసుకుని వాటికి తగినటువంటి చికిత్సలు పొందే అవకాశం ఈ వైద్య శిభిరాల ద్వారా లభించింది. నియోజకవర్గంలోని ప్రజలందరికీ మంచి ఆరోగ్యం, మంచి వైద్య సదుపాయాలే లక్ష్యంగా ఇటువంటి వైద్య శిభిరాల ద్వారా సేవలను అందించేందుకు సుజనా ఫౌండేషన్ ఎల్లప్పుడూ సిద్దంగానే ఉంటుంది.
  • క్రికెట్ లీగ్ రాష్ట్రవ్యాప్తంగా ఔత్సాహిక యువ క్రీడాకారులను ప్రోత్సహించడానికి సుజనా ఫౌండేషన్ రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్‌ను నిర్వహించింది మరియు అథ్లెటిక్స్ లో రాణించే ప్రతిభావంతులను వెలికితీసేందుకు ఫౌండేషన్ నిబద్ధతతో పనిచేస్తోంది. టోర్నమెంట్ నిర్వహణకు అవసరమైన వనరులు, సదుపాయాల కోసం ఫౌండేషన్ ద్వారా 6 లక్షల ఖర్చు చేయడం జరిగింది.

ఇందులో భాగంగానే క్రీడాకారులకు క్రికెట్ బ్యాట్లు, బంతులు, ఇతర అవసరమైన పరికరాలు కూడా అందించటం జరిగింది. ఫౌండేషన్ ప్రోత్సాహంతో పోటీలు నిర్వహించడమే కాకుండా క్రికెట్ క్రీడలో ప్రతిభావంతులను వెలికితీయటం జరిగింది. సుజనా ఫౌండేషన్ నిర్వహించిన టోర్నమెంట్ పాల్గొనే జట్లలో క్రీడాకారుల ప్రతిభను గుర్తించి 2 లక్షల రూపాయిల నగదు బహుమతులు అందించటం జరిగింది. ఈ టోర్నమెంట్ లో దాదాపు 50కి పైగా జట్లు టోర్నమెంట్ టైటిల్ కోసం పోటీ పడ్డాయి. టోర్నీలో గెలిచిన జట్టుకు మొదటి బహుమతిగా లక్ష రూపాయిలు, ద్వితీయ బహుమతిగా 60 వేల రూపాయిలు, మూడో స్థానంలో నిలిచిన జట్టుకు 40 వేల రూపాయిలు అందించటం జరిగింది.

అంతేకాకుండా పోటీలో పాల్గొన్న క్రీడాకారులకు ప్రశంసాపత్రాలను అందించారు. ఇటువంటి టోర్నీలు యువ క్రికెటర్లలో ప్రతిభను వెలికితీయటంతోపాటు యువత కలలను సాకారం చేసుకునేందుకు దోహదపడతాయి. అంతేకాదు సుజనా ఫౌండేషన్ యువ క్రీడాకారులకు ఒక వేదికను అందించడమే కాకుండా, గ్రామ స్థాయిలో క్రీడలను వెలికితీసేందుకు మార్గాన్నిసుగమం చేసింది. ఈ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణ ద్వారా యువతలో వారి క్రీడా స్పూర్తిని నింపి భవిష్యత్తులో ఉన్నత లక్ష్యాలను సాధించేందుకు దోహదపడుతుంది.

  • SAGY గ్రామాలు Sujana Chowdary adopted two villages under the Sansad Adarsh Gram Yojana (SAGY) scheme introduced by Prime Minister Modi. SAGY calls for the adoption of villages by every member of Parliament, who will take up the responsibility for their development. Under this initiative, YS Chowdary adopted the two villages of Ponnavaram and Palaparru. 

Ponnavaram, located in Krishna district, and Palaparru in Guntur district have witnessed major transformational changes ever since their adoption by SujanaChowdary. In accordance with his belief that good quality education, healthcare and a clean environment are the three basic pillars for nation-building, YS Chowdary translated it to action. Digital learning was introduced in the village schools along with free Wi-Fi and books. This ensured that the children were not left behind in the dust and quality education was accessible to all.

Medical camps were conducted, and drainage systems and toilets constructed to improve sanitation and living standards. Cement roads were constructed to improve connectivity and facilitate travel. The transformational change has been felt in all spheres, taking it closer to YS Chowdary’s dream of turning them into self-sufficient model villages.

Mr. YS Chowdary’s efforts through the Sujana Charitable Trust and the Sujana Foundation are well-documented. The Sujana Foundation has extended financial support to the economically weaker sections of the society, providing them with a variety of aids. Mr. Chowdary was a member of the Share Medical Care, a Charitable Orgnisation started in 1987. He was also the Chairman of the Executive Committee of Share Medical Care, operating the MediCiti Institute of Medical Sciences, Hyderabad. The MediCiti Institute has a medical college, a nursing college, and a 600-bed free-service hospital. He relinquished the membership of Share Medical Care in the year 2014. During his tenure, Mr. Chowdary participated actively in turning around the organisaation.

3905686-200

సుజనా ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిర్వహించబడుతున్న సుజనా ఫౌండేషన్ వెనుకబడిన వర్గాల విద్య, వైద్య, ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించింది. సుజనా గ్రూప్ పేదలకు అందిస్తున్న సేవలను సామాజిక బాధ్యతగా భావిస్తుంది.

teTelugu