రాజకీయవేత్త

చౌదరి గారు తాను ఒక ప్రణాళిక ప్రకారం రాజకీయాల్లోకి రాలేదని, దైవికంగా అనుకోకుండా వచ్చానని చెబుతుంటారు. అయితే ఒకసారి రాజకీయ ప్రయాణం మొదలుపెట్టిన తర్వాత నుంచి చిత్తశుద్ధితో ప్రజాసంక్షేమం కోసం పనిచేశారు. ప్రజల జీవితాలలో సానుకూల మార్పు తీసుకురావటానికి అప్పటినుంచి నిరంతర కృషి చేస్తున్నారు.

ఎన్టీఆర్ ట్రస్ట్ కార్యకలాపాల్లో పాలుపంచుకునే క్రమంలో చౌదరి గారికి రాజకీయాలతో పరిచయం ఏర్పడింది. అగ్రశ్రేణి నటుడు, తెలుగుదేశం స్థాపకుడు ఎన్ టి రామారావు పట్ల గౌరవాభిమానాలతో ఆయన పేరుతో ఏర్పాటైన ట్రస్టు సేవాకార్యక్రమాల్ని విస్త్రతం చేసేందుకు చౌదరి గారు తనవంతు సాయాన్ని అందించారు. ఈ క్రమంలో ఆయనకి ఎన్టీఆర్ ట్రస్టుతో, ఆ తర్వాత తెలుగు దేశం పార్టీతో సంబంధాలు ఏర్పాడ్డాయి.

రాజకీయ ప్రపంచంలో ఎదుగుదలకు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారే చౌదరి గారికి మార్గదర్శకులు. ఆయన ప్రోత్సాహంతో పార్టీ విధివిధానాల రూపకల్పనలో పాలుపంచుకోవటం ప్రారంభించారు. 2009 ఎన్నికల్లో, ఆ తర్వాత 2014 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడి గారి నాయకత్వంలో కీలక పాత్ర పోషించారు.

పార్టీకి చేసిన సేవల్ని, కృషిని గుర్తించిన పార్టీ నాయకత్వం రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించడానికి ఆయనను ఎంపిక చేసింది.

2010 జూన్ 22న తెలుగుదేశం పార్టీ తరఫున రాజ్యసభ సభ్యునిగా ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. అప్పటినుంచి తన పూర్తికాలాన్ని ప్రజాజీవితం మీద ప్రభావం చూపే అంశాల మీద దృష్టి పెట్టి, రాష్ట్రానికి చెందిన వివిధ సమస్యల పరిష్కారానికి కృషి చేశారు.

సైన్స్ & టెక్నాలజీ సహాయమంత్రి

2014లో విభజిత ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ గెలుపొందింది. కేంద్రంలో నరేంద్ర మోడి నాయకత్వంలో నేషనల్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎన్టీఏ) ప్రభుత్వం ఏర్పడింది. తెలుగుదేశం అప్పటికే ఎన్డీయేలో భాగస్వామిగా ఉంది. కేంద్ర ప్రభుత్వంలో పాలుపంచుకోవాల్సిందిగా తెలుగుదేశం పార్టీకి ఆహ్వానం అందింది. ఈ మేరకు 2014 లో మంత్రి మండలి విస్తరణలో శ్రీ చంద్రబాబునాయుడు గారి సలహా మేరకు చౌదరి గారిని సహాయ మంత్రి పదవికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎంపిక చేశారు. ఆయన వ్యాపార వ్యవహారాలతో సంబంధం లేకుండా, అదే సమయంలో సాంకేతిక రంగంలో ఆయనకు ఉన్న అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని చౌదరి గారికి శాస్త్ర సాంకేతిక మరియు భూ విజ్ఞాన శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు.

కేంద్రంలో మంత్రిగా శ్రీ చౌదరి గారు క్రియాశీలక పాత్ర పోషించారు. వివిధ పార్లమెంటరీ గ్రూప్ లలో, కమిటీలలో చురుకైన పాత్ర వహించారు. ఇండో, సింగపూర్ పార్లమెంటరీ అనుబంధ బృందంలో కీలక సభ్యుడిగా, భారత్, సింగపూర్ పార్లమెంట్ల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించే లక్ష్యంతో పనిచేశారు. అదేవిధంగా వాణిజ్యంపై పార్లమెంట్ స్టాండింగ్ కమిటి, యువతపై పార్లమెంటరీ ఫోరమ్ కమిటి, ఫుడ్ ప్రొసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వశాఖ సలహ కమిటీలో కూడా పని చేశారు.

కేంద్రం నుంచి ఏపీకి నిధుల సాయం

కేంద్ర మంత్రిగా ఆంధ్రప్రదేశ్ కి విభజన చట్టంలో ఇచ్చిన వివిధ హామీలని నెరవేర్చడంలో శ్రీ చౌదరి గారు విశేష కృషి చేశారు. కేంద్ర సహాయ మంత్రిగా ఏపీ పునర్విభజన చట్టంలో పేర్కొన్న హామీలు నెరవేర్చటంలో భాగంగా నిధుల విడుదలకు తోడ్పడ్డారు. అప్పటి ఆర్థికమంత్రి శ్రీ అరుణ్ జైట్లీ సహకారంతో కేంద్ర నిధులు, గ్రాంట్లు విడుదల చేయించి, విభజన గాయాల నుంచి ఆంధ్రప్రదేశ్ త్వరితగతిన కోలుకోవటానికి దోహదపడ్డారు. వివిధ ప్రతిష్టాత్మక కేంద్ర సంస్థల్ని కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రంలో నెలకొల్పడానికి ఒక మంత్రిగానే కాకుండా, ఆంధ్ర రాష్ట్రం సత్వరం ప్రగతిపథంలోకి రావాలన్న తాపత్రయంతో పనిచేశారు.

భారతీయ విజ్ఞానశాస్త్ర శిక్షణ మరియు పరిశోధన సంస్థ (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్) వంటి ప్రతిష్టాత్మక సంస్థలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకురావడంలో చౌదరి గారు ముఖ్య పాత్ర వహించారు. 2015 నుండి 2018 వరకు కేంద్రమంత్రిగా ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర నుంచి లభించిన సహాయం గణనీయమైంది. ఇది కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి అండగా నిలిచింది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఒక రాష్ట్రానికి ఇంత పెద్ద ఎత్తున కేంద్ర నిధులని, కేంద్ర సాయాన్ని అందించడం జరగలేదు.

శ్రీ చౌదరి గారు తన పార్లమెంటరీ విధులతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొన్నారు. 2014లో భారత ప్రభుత్వం ప్రారంభించిన గ్రామీణాభివృద్ధి కార్యక్రమంలో భాగంగా సంసద్ ఆదర్శ గ్రామ యోజన పథకంలో భాగంగా ప్రతి పార్లమెంట్ సభ్యుడు మూడు గ్రామాలను దత్తత తీసుకొని వాటి సమగ్ర అభివృద్ధికి బాధ్యత వహించాల్సి ఉండగా ఏపీలోని రెండు గ్రామాలను దత్తత తీసుకొని వాటిని ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దారు.

ఎన్టీఆర్ జిల్లాలోని పొన్నవరం, గుంటూరు జిల్లాలోని పాలపర్రు గ్రామాలను శ్రీచౌదరి గారు దత్తత తీసుకున్నారు. ఆయన మార్గదర్శకంలో ఈ గ్రామాలు విద్య, ఆరోగ్య సంరక్షణ, మహిళా సాధికారత, సామాజిక బాధ్యత వంటి అంశాలలో విశేష అభివృద్ధికి నోచుకున్నాయి. అందరికీ విద్యలో భాగంగా తరగతి గదిలో డిజిటల్ శిక్షణా విధానం ప్రవేశపెట్టడం, ఉచిత వైఫై అందించడం, వనరులను సమకూర్చటం, గ్రామీణ విద్యార్ధులకు నాణ్యమైన విద్య అందుబాటులోకి తీసుకు రావటం జరిగింది. అంతేకాకుండా ప్రజలకు ప్రాథమిక వైద్యం అందించడం కోసం వైద్యశిబిరాలు ఏర్పాటు చేయటం జరిగింది. పారిశుద్ధ్యం, డ్రైనేజి వ్యవస్థలను మెరుగుపర్చటంతోపాటు, ప్రజల జీవన ప్రమాణాలను పెంచారు. ఆరోగ్య సంరక్షణ, పరిశుభ్రతపై అవగాహన జరిపారు.

నాణ్యమైన విద్య, వైద్యం, పరిశుభ్రత, పర్యావరణాలే దేశ నిర్మాణానికి మూలస్తంభాలు అనే చౌదరి గారి అభిమతానికి అనుగుణంగా దత్తత గ్రామాలలో అటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. సరైన దిశతో నిర్మాణాత్మకమైన అడుగులు వేస్తే సమాజాభివృద్ధిలో గణనీయ మార్పులకు దారితీస్తుందనే చౌదరి గారి ఆశయాలకు ఈ రెండు గ్రామాలు నిదర్శనంగా మారాయి.

పార్లమెంటరీ పదవీకాలం

సుజనా చౌదరి గారు మార్చి 2018 వరకు కేంద్ర మంత్రిగా పదవీబాధ్యతలని నిర్వహించారు. అంతకుముందు 2014 మే నెలలో చౌదరి గారు తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ నాయకుడిగా ఎన్నికయ్యారు. ఐదేళ్ళ పాటు ఆ పదవిలో కొనసాగారు. బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం నుంచి వైదొలగాలన్న తెలుగుదేశం పార్టీ నిర్ణయానికి అనుగుణంగా మంత్రి పదవికి చౌదరి గారు రాజీనామా చేశారు. అనంతర పరిణామాల్లో ఆయన బిజెపిలో చేరారు. పార్లమెంటు సభ్యునిగా ఆయన పదవీ కాలం 2022 ఏప్రిల్లో ముగిసింది. పార్లమెంట్ సభ్యునిగా.

ప్రస్తుతం ఎటువంటి అధికారిక పదవి లేనప్పటికీ చౌదరి గారు బిజెపిలో పనిచేస్తూ, వివిధ సమస్యల పరిష్కారానికి విధానాల రూపకల్పనతో పాటు ప్రజాజీవితంలో వివిధ సేవలతో ముందుకు సాగుతున్నారు. ప్రజల సంక్షేమానికి సంబంధించిన జాతీయ, ప్రాంతీయ ప్రాముఖ్యత గల సమస్యలను పరిష్కరించడానికి చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు.

3905686-200

చౌదరి గారు తాను అనుకొని రాజకీయాల్లోకి రాలేదని అదృష్టంతో అనుకోకుండా వచ్చానని తరుచూ చమత్కరిస్తుంటారు. అతను తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించిన తరువాత ప్రజల జీవితాలలో సానుకూల మార్పును ప్రభావితం చేయడంలో విజయం సాధించాడు.

teTelugu