ఆర్థిక వ్యవస్థకి బూస్టర్ డోస్

దేశంలోని కార్పొరేట్ రంగానికి నెల ముందే దీపావళి వెలుగులు తీసుకొచ్చింది మోడీ సర్కార్. కార్పొరేట్ పన్ను 30 నుంచి 22 శాతానికి తగ్గించడం వల్ల తయారీ రంగానికి ఆక్సిజన్ ఇచ్చినట్టయింది. దేశం ఆర్థికంగా కోలుకోడానికి ఈ నిర్ణయం సంజీవనిలా పనిచేయనుంది. దీని వల్ల భారత్ పెట్టుబడులకు ఆకర్షణీయ గమ్యంగా మారబోతోంది. భారతదేశంలో విదేశీ కంపెనీలు విరివిగా పెట్టుబడులు పెట్టడానికి ఈ నిర్ణయం దోహదం చేయనుంది. కేంద్రం తీసుకున్న ఈ సంచలన నిర్ణయం వల్ల ఉత్పత్తుల ధరలు తగ్గడం ద్వారా ద్రవ్య చలామణి పెరగనుంది. దేశంలో మరిన్ని కొత్త ఉద్యోగాల కల్పనకు అవకాశం ఏర్పడింది. చైనా, అమెరికా, కొరియా వంటి తక్కువ పన్నులున్న దేశాలతో పోటీ పడేందుకు మార్గం సుగమమైంది. జీడీపి ఆరేళ్ల కనిష్ట స్థాయికి చేరుకుని, ఆర్థిక వ్యవస్థ మందగమనంలో వున్న నేపథ్యంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇచ్చిన బూస్టర్ డోస్ ఇది. తీవ్ర ఒడిదొడుకుల్లో కొట్టుమిట్టాడుతున్న దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్లీ ఒక్కసారిగా భారీ లాభాల్లోకి దూసుకెళ్లడమే దీనికి నిదర్శనం.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

teTelugu